Akhanda 2 : న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ఆరోజునే ?

Leave a Comment

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పాన్ ఇండియన్ సినిమా అఖండ 2. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 


ఇటీవల షూటింగ్ ఆల్మోస్ట్ చివరిదశకు చేరుకున్న ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు బాలకృష్ణ. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ అఘోర పాత్రలో అత్యద్భుతమైన పర్ఫామెన్స్ కనబరిచారని టీమ్ అయితే చెప్తోంది. 


వాస్తవానికి సెప్టెంబర్ 25న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ కొన్నాళ్లపాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీని డిసెంబర్ 5న భారీ ఎత్తున రిలీజ్ చేయటానికి టీమ్ అయితే సన్నాహాలు చేస్తుందట. త్వరలో అనగా దసరా పండుగ రోజున దానికి సంబంధించిన అధికారిక అనౌన్స్మెంట్ కూడా రానుందనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. 


అఖండ మాదిరిగా ఈ సినిమాలో కూడా సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని తమన్ అదరగొట్టారని, త్వరలో సినిమాకు సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ అధికారికంగా విడుదల కానుందని తెలుస్తుంది.

Similar Links

0 comments:

Post a Comment